పాలకూరతో ఎన్ని లాభాలో!

Halth Tips

 

ఆకుకూరల్లో ‘ పాలకూర ’ ఎంతో ప్రయోజనకారి అని మనందరికీ తెల్సిన విషయమే. దీన్ని ఎక్కువగా ఆహారంలో తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు వుంటాయంటున్నారు వైద్యులు. ఇది విటమిన్లను సమృద్ధిగా కలిగి వుంటుంది. విటమిన్ ఎ , బి , సి, ఐరన్, కాల్షియం, ప్రొటీన్, కార్బొహైడ్రేట్స్, ఫైబర్, ఖనిజాలు, మెగ్నీషియం, ఇనుము, అమైనో ఆమ్లాలు మరియు ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు విస్తారంగా లభ్యమవుతాయి. దీన్ని వండి, వండకుండా రెండు రకాలుగా కూడా తినవచ్చు. పచ్చి పాలకూర తింటేనే ఎక్కువ ప్రయోజనం. ఎన్నో పోషక విలువలు కలిగిన పాలకూర వల్ల కలిగే లాభాలు…

 

  1. రక్తపోటు నియంత్రణ

పాలకూరలో పొటాషియం ఎక్కువగా వుండటం వల్ల ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె వ్యాధుల నిరోధానికి కూడా పనిచేస్తుంది.

 

  1. కండరాలను బలపరుస్తుంది

పాలకూర యాంటీ ఆక్సిడెంట్ మరియు ప్రోటీన్ తత్వాలను ఎక్కువగా కలిగి వుండటం వల్ల కండరాలను బలోపేతం చేస్తుంది. ఆకలిని పెంచే గుణాలు కలిగి వుంది ఈ ఆకుకూర.

 

  1. ఊబకాయాన్ని తగ్గిస్తుంది

ఊబకాయంతో బాధపడేవారు క్రమం తప్పకుండా పాలకూర, క్యారట్లను కలిపి జ్యూస్ చేసుకుని తాగితే మంచి ఫలితం వుంటుంది. ఇది బలహీనతను తగ్గిస్తుంది మరియు కొవ్వు తగ్గించడంలో సహాయపడుతుంది.

 

  1. మెరుగైన జీర్ణక్రియ

జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేకపోతే శరీరం మీద ఎన్నో వ్యాధుల దాడి చేసే అవకాశం ఎక్కువగా వుంటుంది. దీన్ని నివారించడానికి ఆరోగ్యకరమైన కూరగాయలను, ఆకుకూరలను ఆహారంలో చేర్చడం ముఖ్యం. పాలకూర తినడం ద్వారా జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.

 

  1. కళ్ళకు ప్రయోజనకరమైనది

పాలకూర, టమాట, క్యారెట్ల జ్యూసులు క్రమం తప్పకుండా తాగడం వల్ల కంటిచూపును మెరుగు పరుచుకోవచ్చు. వీటిలో కళ్ళకు మేలు చేసే విటమిన్    ‘ ఎ ’ సమృద్ధిగా వుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *