కూతుళ్ల పెళ్లి ఖర్చు తండ్రే భరించాలి

NEWS
కుమార్తెల పెళ్లికి అయ్యే మెుత్తం ఖర్చును తండ్రే భరించాలని కేరళ హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. అంతేకాదు కుమార్తె ఉద్యోగం చేసి సంపాందిస్తున్నప్పటికీ తన తండ్రిని డబ్బులు డిమాండ్ చేయచ్చని తెలిపింది. అలాగే వివాహేతర సంబంధం ద్వారా కలిగిన సంతానానికి కూడా ఈ  హక్కు ఉంటుందని స్పష్టం చేసింది.  భార్యకు, కుమార్తెకు వేరే ఆదాయ మార్గాలు ఉన్న కూడా పెళ్లి కోసం డబ్బులు అడిగే హక్కు కుమార్తెకు  ఉందని  కోర్టు పేర్కొంది.

కోయంబత్తూరుకు చెందిన అంబిక అరవిందాక్షణ్ తన పెళ్లి ఖర్చులు పెట్టుకోవడానికి తన తండ్రి ముందుకు రావడం లేదని ఆరోపిస్తూ పాలక్కాడ్ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తండ్రి నుంచి రూ. 5లక్షలు ఇప్పించాల్సిందిగా కోర్టును కోరింది. ఆమె తల్లికి ఇంటి అద్దెల ద్వారా నెలకు రూ 12వేల ఆదాయం వస్తుందని, తండ్రి నుంచి పెళ్లి ఖర్చులకు డబ్బు అడగడం మంచిది కాదంటూ కోర్టు  తీర్పు ఇచ్చింది.

అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ అంబిక కేరళ హై కోర్టును ఆశ్రయించింది. ఆమె అప్పీలును విచారించిన హైకోర్టు..  కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తప్పుబట్టింది. వారికొచ్చే రూ12వేల ఆదాయం చూపి కేసును కొట్టివేయడం సరికాదని మండిపడింది. ‘ఒక్కసారి ఆలోచంచిండి.. రూ.12వేలు మనిషి కనీస అవసరాలు తీర్చడానికి కూడా సరిపోవు.. ఆమె పెళ్లి ఖర్చులు తండ్రి పెట్టుకోవాల్సిందే’ అని  వ్యాఖ్యానించింది. 1987లో కరుణాకరన్ నాయర్ vs సుశీల అమ్మ కేసులో  ఇచ్చిన తీర్పును కోర్టు ఉదహరించింది. తల్లీకుమార్తెలకు ఆదాయం ఉన్నప్పటికీ కుమార్తె విద్య,పెళ్లి కోసం అయ్యే ఖర్చులను తండ్రినే చెల్లించాల్సి ఉంటుందని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *