ఆకతాయిల ఆటలు కట్టు చేసిన షీ టీం..

NEWS

సిరిసిల్ల పాత బస్టాండ్ ప్రాంతంలో కాలేజీ విద్యార్థినుల పట్ల ఆకతాయి పనులు చేస్తున్న 6 గురు పోకిరీలు కు కౌన్సిలింగ్ నిర్వహించిన సిరిసిల్ల షీ టీం.
ఈరోజు సిరిసిల్ల పాత బస్టాండ్ ప్రాంతంలో అమ్మాయిలను వేధిస్తున్న పెద్దూర్ కి చెందిన ఒకరు, చిన్నబోనాలకి చెందిన ఇద్దరు, తాడూర్ కి చెందిన ముగ్గురిని పట్టుకున్న షీ టీం బృందం.
ఆరుగురు కాలేజీ యువకులు చంద్రశేఖర్, శ్రీకాంత్, అఖిల్, మహేష్, బాలకిషన్, హరీష్, లు మఫ్టీ లో ఉన్న షీ టీం బృందాన్ని గుర్తించి పారిపోయేందుకు ప్రయత్నించగా వారి ని ఛేదించి పట్టుకోవడం జరిగింది. ఆ యువకుల కుటుంబ పెద్దలను పిలిపించి షీ టీం ఇంచార్జ్ SI మురళి, ASI సోనా గార్ల చే కౌన్సిలింగ్ నిర్వహించి పంపడం జరిగింది.

1 thought on “ఆకతాయిల ఆటలు కట్టు చేసిన షీ టీం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *