‘అజ్ఞాతవాసి’ ప్రీమియర్ షోలు తెలంగాణలో బంద్!

NEWS

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్  కాంబినేషన్లో వస్తున్న ‘అజ్ఞాతవాసి’ సినిమా జనవరి10న విడుదల కానుంది. అయితే ఈసినిమా ప్రీమియర్ షోలను వేయరాదని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. అర్థరాత్రి తర్వాత వేసే ఈ షోల వల్ల  అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగే అవకాశాలు ఉన్నాయని పోలీసులు నిర్మాతలను చెప్పారు. అన్ని థియేటర్ల వద్ద బందోబస్తు పెట్టడం సాధ్యం కాదని, అందుకే ప్రీమియర్ షోలు వేయరాదని పోలీసులు నిర్మాతలకు సమాచారం ఇచ్చారు.

గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం రోజుకు ఏడు షోలను వారం రోజుల పాటు వేసుకోవచ్చని ‘అజ్ఞాతవాసి’ సినిమాకు ప్రత్యేక అనుమతులిచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *